Medaram Jathara: మేడారం జాతరకు రూట్‌మ్యాప్ ఇదే.. ఫాలో అవ్వండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medaram Jathara: మేడారం మహాజాతరకు సంబంధించి ఇప్పటికే పలువురు ముందస్తు మొక్కులు సమర్పిస్తుండగా.. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చేయడంతో పాటు పోలీసు శాఖ కూడా అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. మేడారం రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నేటి నుంచి జాతర ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, పలుచోట్ల వన్ వే ట్రాఫిక్ కూడా విధించారు. తేకాకుండా.. ‘మై మేడారం’ యాప్‌కు తోడు ‘టీఎస్‌ఆర్టీసీ మేడారం జాతర’, ‘మేడారం పోలీస్ 2024’ యాప్‌లను సైతం అందుబాటులో ఉంచారు. ఇక మరోవైపు మేడారం రూట్ మ్యాప్‌ను ములుగు ఎస్పీ శబరీష్ విడుదల చేశారు. మేడారం మహాజాతరకు వెళ్లే వాహనాలు ఏయే రూట్లలో ప్రయాణించాలి? ఎక్కడి నుంచి క్రాసింగ్ వెళ్లాలో వివరిస్తూ మేడారం రూట్ మ్యాప్ ప్రకటించారు.
మేడారం రూట్ మ్యాప్ ఇలా..
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
* హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పస్రా మీదుగా గూడెప్పాడ్, ఆత్మకూరు మీదుగా వెళ్లాలి. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి.
* ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగు, పస్రా, నార్లాపూర్ మీదుగా 163 జాతీయ రహదారి మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గంలో వచ్చే వాహనాలకు ఊరట్టం క్రాస్ నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకు అన్ని చోట్ల పార్కింగ్ స్థలాలు కూడా అందుబాటులో ఉంచారు.
* జాతర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి, రేగొండ, పరకాల మీదుగా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా గూడెప్పాడ్ క్రాస్ దగ్గర కుడివైపునకు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా గమ్యస్థానాలకు వెళ్లవచ్చు.
* ఖమ్మం, మహబూబాబాద్ వైపు వెళ్లే వాహనాలు గూడెప్పాడ్ వద్ద ఎడమవైపు నుంచి ములుగు వైపు వెళ్లాలి. ఆత్మకూరు, కటాక్షపూర్ దాటిన తర్వాత మల్లంపల్లి వచ్చి అక్కడ మలుపు తీసుకుని సొంత గ్రామాలకు వెళ్లవచ్చు.
* గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. అలాంటి వాహనాలకు ఊరట్టం సమీపంలో పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఈ వాహనాలన్నీ కూడా తిరుగు ప్రయాణంలో అదే మార్గంలో బయలుదేరాలి. అంతే కాకుండా నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా వెళ్లే అవకాశం కూడా ఉంది.
* ఛత్తీస్‌గఢ్. భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ వాహనాలన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చిన దారిలోనే బయలుదేరాలి.
పార్కింగ్ ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు
మహాజాతర కోసం ‘మేడారం జాతర’ పేరుతో మొబైల్ యాప్‌ను విడుదల చేసిన అధికారులు వాహనాలకు ఇబ్బందులు తలెత్తకుండా మేడారంలో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మేడారం చుట్టుపక్కల 1,400 ఎకరాలను పార్కింగ్ కోసం రిజర్వు చేశారు. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి మేడారం రూట్ బస్టాండ్ స్థలంలో పార్కింగ్ చేయాలి. సీట్ల దగ్గరే వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాలు కేటాయించారు. పస్రా, మేడారం మార్గంలో జంపన్నవాగు సమీపంలో ప్రైవేట్ వాహనాలు నిలిపేందుకు అవకాశం కల్పించారు. భక్తులు వీలైనంత వరకు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!