NTV Telugu Site icon

CPI: ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సీపీఐ

Cpi Rmakrishna

Cpi Rmakrishna

CPI: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెఫ్ట్‌ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్, సీపీఎం పార్టీలతో పలు దఫాలుగు జరిగిన చర్చల అనంతరం కుదిరిన అవగాహన మేరకు సీపీఐ ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. సీపీఎం పోటే చేసే ప్రాంతాల్లో మాత్రం సీపీఐ సీపీఎంకు మద్దతు అందించనుంది. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది.

సీపీఐ పార్లమెంట్ అభ్యర్థి వీరే..
గుంటూరు పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి-కామ్రేడ్ జంగాల అజయ్‌ కుమార్.

అసెంబ్లీ నియోజకవర్గాల సీపీఐ అభ్యర్థులు..

విశాఖ పశ్చిమ – కామ్రేడ్ అత్తిలి విమల

ఏలూరు – కామ్రేడ్ బండి వెంకటేశ్వరరావు

విజయవాడ పశ్చిమ – కామ్రేడ్ జి కోటేశ్వరరావు

అనంతపురం అర్బన్- కామ్రేడ్ సి. జాఫర్

తిరుపతి – కామ్రేడ్ పి. మురళి

పత్తికొండ – కామ్రేడ్ పి.రామచంద్రయ్య

రాజంపేట – కామ్రేడ్ భూక్య విశ్వనాథ నాయక్

కమలాపురం – కామ్రేడ్ గాలి చంద్ర