CPI General Secretary D Raja: ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెత్తనమేంటి..? అని మండిపడ్డారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తిరుపతిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం సురక్షితంగా లేదు.. అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, భారత్ కు ట్రంప్ సలహాలు అవసరం లేదన్న ఆయన.. అసలు ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..? అని నిలదీశారు.. మరోవైపు, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే మోడీ ఎందుకు రావడం లేదు..? అని ప్రశ్నించారు.. అఖిలపక్ష సమావేశానికి వస్తే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనే భయం ప్రధాని మోడీలో ఉందన్నారు రాజా..
Read Also: Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!
ఉగ్రవాదులకు మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు డి. రాజా.. పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో భారతీయులపై దాడి బాధాకరమన్న ఆయన.. భారత్ లోకి ఉగ్రవాదులు ప్రవేశించేంత వరకు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేశాయి..? అని ప్రశ్నించారు.. భారత్ లో పర్యాటకుల మృతిపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.. పహల్గామ్ ఘటనపై పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉందని.. చర్చ జరిగితే పార్లమెంటు వేదికగా మోడీని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. ఇక, మావోయిస్టులపై కేంద్రప్రభుత్వం ప్రతాపం చూపిస్తానంటోంది.. ఉగ్రవాదులను పిలిచి మాట్లాడాలనుకునే కేంద్రం.. మావోయిస్టులను ఎందుకు పిలిచి మాట్లాడరు? అని ప్రశ్నించారు. చర్చలకు వస్తానంటున్న మావోయిస్టులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని నిలదీశారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా..
