Ramakrishna: క్లారిటీతో ఉన్నాం.. మేం టీడీపీతో కలిసి పోటీ చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ మాత్రమే క్లారిటీతో ఉన్నాయి.. మేం తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తాం అని ప్రకటించారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. వైసీపీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తోంది.. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆరోపించిన ఆయన.. అందుకే తాము వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ప్రకటించారు.. ఇక, గౌతం అదానీకి గ్రీన్ ఛానెల్ వెల్కం చెప్పడం దురదృష్టకరం అన్నారు రామకృష్ణ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 1400 ఎకరాల భూమిని అమ్మడానికి అమిత్ గుప్తాకు అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు. 1400 ఎకరాలు దక్కించుకోడానికే సీఎం వైఎస్ జగన్‌తో అదానీ భేటీ జరిగిందని ఆరోపించారు..
Read Also: Mystery Box At Vizag: విశాఖ తీరంలో మిస్టరీ బాక్స్‌పై ఉత్కంఠకు తెర.. అసలు అది పెట్టే కాదు..!
Also Read
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
మరోవైపు.. కమ్యూనిష్టులు అమ్ముడు పోయారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టం అన్నారు రామకృష్ణ.. సజ్జల మాటలు ఆయన మాస్టర్ చెప్పించిన మాటలుగా భావిస్తున్నాం అన్నారు.. ఇక, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏనాడూ విశాఖ స్టీల్ ప్లాంట్ ధర్నాల వద్దకు పోలేదని వ్యాఖ్యానించారు.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడుతున్న జీవీఎల్.. ఎన్నాళ్లూ గాడిదలు కాస్తున్నాడా..? అని నిలదీశారు. మరోవైపు.. స్మార్టు మీటర్లు ఏర్పాటు చేయడానికి కూడా అదానీకి అప్పజెప్పారని విమర్శించారు.. చండీగఢ్ లో 9,000 ఉన్న స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రంలో 30 వేలు ఎలా అయ్యాయి? అని ప్రశ్నించారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, అదానీ, సీఎం వైఎస్ జగన్ కలిసే ఇదంతా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, ఏపీలో ఎన్నికల పొత్తులపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది.. తమతో పొత్తుపై బీజేపీయే నిర్ణయం తీసుకోవాలన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయని స్పష్టం చేసిన విషయం విదితమే.. ఇప్పుడు టీడీపీ, జనసేనకు సీపీఐ కూడా తోడైనట్టు అయ్యింది.
తాజావార్తలు
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!