Site icon NTV Telugu

CP CV Anand: 35 ఏళ్ల తర్వాత ఒకేరోజు హోలీ, రంజాన్ రెండో శుక్రవారం.. సీవీ కీలక సూచనలు…

Hyd Cp

Hyd Cp

35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని పోలీసు అధికారులకు కోరారు.

READ MORE: DMK: ఉత్తరాది మహిళలు 10 మందిని పెళ్లి చేసుకుంటారు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

అసాంఘిక శక్తులపై, వెగాబాండ్ లపై గట్టీ నిఘా ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. రంగుల హోలీ తమ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామని సీవీ ఆనంద్, డీజీ కమిషనర్ ఆఫ్ పోలీసు తెలిపారు. భాగ్యనగర వాసులకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ (అడిషనల్ సీపీ లా ఆండ్ ఆర్డర్), చైతన్య కుమార్ (డీసీపీ స్పెషల్ బ్రాంచ్), జోనల్ అధికారులు పాల్గొన్నారు.

READ MORE: Tummala Nageswara Rao : సత్తుపల్లి అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా నిలుస్తుంది

Exit mobile version