Covid-19: కొవిడ్ పుట్టుక చైనా ల్యాబ్ నుంచే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid-19: కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని పలు దేశాలు నిందించిన సంగతి తెలిసింది. ఈ మహమ్మారి చైనా ల్యాబ్ నుంచి లీక్ అయ్యిందంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా కొవిడ్ పుట్టుక చైనాకు చెందిన ల్యాబ్ నుంచే జరిగిందని అమెరికాకు చెందిన కీలకమైన ఎనర్జీ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ విషయంపై అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కార్యాలయం గుర్తించినట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అమెరికాలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో జాతీయ రీసెర్చ్ సెంటర్‌ను ఆ సంస్థ పర్యవేక్షిస్తుంది. గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్ వైరస్ ఎలా పుట్టిందనేది నిర్ణయించబడలేదని చెప్పింది. కానీ ఇప్పుడూ తాజాగా 2021లో ఇచ్చిన నివేదికను నవీకరిస్తూ వ్యూహాన్ ల్యాబ్ లీక్ వల్లే ఆ మహమ్మారి ఉద్భవించిందని పేర్కొనడం గమనార్హం.
Read Also: Zelensky: వ్లాదిమిర్ పుతిన్ తన దగ్గర వాళ్లతోనే చంపబడతాడు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
గతంలో అమెరికాకు చెందిన పలు డిపార్ట్‌మెట్లు కరోనా పుట్టుకపై అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తాజాగా 5 పేజీల నివేదికతో ఎనర్జీ డిపార్ట్మెంట్ కూ చైనా వైపే చూపించింది. ఇదిలా ఉండగా,..నాలుగు ఏజెన్సీలు కరోనా సహజంగానే పుట్టుకొచ్చిందని విశ్వస్తుండగా, మరో రెండు ఏజెన్సీలు ఏ విషయాన్ని నిర్థారించలేదు. ఏదీఏమైన ఈ కరోనా విషయంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయని జాతీయ భద్రతా సలహదారు జేకే సుల్లివిన్ వెల్లడించారు. గతంలో ఎఫ్‌బీఐ కూడా చైనాలోని ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు వైరస్ లీకై ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇప్పటికే పలు ఇంటెలిజెన్స్ సంస్థలను కరోనా మహమ్మారిపై వీలైనంత ఎక్కవ సమాచారం సేకరించాలని సూచించారు. ఏజెన్సీ తమ పరిశోధనలు విరమించుకుంటున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఉద్భవం గురించి ప్రకటించేవరకు తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకటించింది.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..