Sridevi: కోర్టు హీరోయిన్ కీలక ప్రకటన.!

Sridevi

Sridevi

Sridevi: ‘కోర్ట్’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీదేవి ఆపళ్ల తన అభిమానులకు, నెటిజన్లకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తన పేరుతో జరుగుతున్న కొన్ని తప్పుడు ప్రచారాలపై ఆమె స్పందించారు. ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన స్టేటస్ ప్రకారం… కొంతమంది వ్యక్తులు తన అనుమతి లేకుండా, తన పేరు, గుర్తింపును వాడుకుంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను నడుపుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది.

ఈ నకిలీ అకౌంట్ల వల్ల అభిమానులు మోసపోయే ప్రమాదం ఉండటంతో ఆమె తక్షణమే స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన ప్రమేయం లేకుండా, తన పేరు మీద కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రన్ అవుతున్నాయని శ్రీదేవి పేర్కొన్నారు. ఆయా ఛానెళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ నకిలీవని ఆమె స్పష్టం చేశారు. నెటిజన్లు లేదా అభిమానులు ఎవరైనా అలాంటి ఛానెళ్లను చూస్తే, అవి తన అధికారిక ఛానెళ్లుగా భావించవద్దని కోరారు. తనకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారమైనా, సోషల్ మీడియా అప్‌డేట్స్ అయినా నేరుగా తన ప్రస్తుత ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారానే పంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు.

సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తెలుగమ్మాయి, తన పేరిట జరుగుతున్న ఈ డిజిటల్ అవకతవకలపై అప్రమత్తంగా ఉంటూ అభిమానులను కూడా అలర్ట్ చేశారు.