Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident : సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా బిడ్డను కాసేపు కూడా చూడకుండా ఉండలేరు. కానీ ఇజ్రాయెల్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమాన టికెట్ కొనాల్సి వస్తుందని ఓ జంట తమ బిడ్డను ఎయిర్ పోర్టులోనే వదిలి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తం అవ్వడంతో వారి ప్రయత్నాన్ని నిరోధించారు. బెల్జియన్ పాస్‌పోర్టులను కలిగి ఉన్న ఈ జంట.. బిడ్డతో కలిసి బ్రస్సెల్స్‌కు వెళ్లేందుకు టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలుస్తున్నది. టెర్మినల్ కౌంటర్ 1 వద్దకు రాగానే వారి బిడ్డకు కూడా టికెట్ కొనుగోలు చెప్పడంతో ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని ర్యాన్ ఎయిర్ కౌంటర్ మేనేజర్ చెప్పారు. ఇలాంటి ఘటనను తామెన్నడూ చూడలేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. చెక్-ఇన్ కౌంటర్ వద్ద బిడ్డను వదిలి వెళ్లిపోయేందుకు యత్నించిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Intel : ఉద్యోగాలుంటాయ్.. కానీ జీతాలు తగ్గిస్తాం.. ఇక మీ ఇష్టం
Also Read
ఇజ్రాయెల్ నుండి ర్యాన్‌ఎయిర్ విమానంలో బ్రస్సెల్స్‌కు వెళ్లడానికి దంపతులు వచ్చారు. తమ ఏడాది వయసున్న మగబిడ్డకు టిక్కెట్ కొనలేదు. పిల్లలతో ప్రయాణించే వ్యక్తులు ల్యాప్ సీటు కోసం సుమారు 25 డాలర్లు చెల్లించాలి. లేదా ర్యాన్‌ఎయిర్ ప్రామాణిక ఛార్జీల ప్రకారం ప్రత్యేక సీటును కొనుగోలు చేయాలి. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే చెక్-ఇన్ కౌంటర్లు మూసేశారు. అక్కడ సిబ్బంది వారిని ఆపి టికెట్ లు అడిగారు. అయితే, వారు రెండు టికెట్లే చూపించారు. శిశువుకు టికెట్ కొనలేదు. భద్రత సిబ్బంది ఆ చిన్నారి టికెట్ గురించి అడగగా.. క్యారియర్‌లో శిశువును వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇది చూసి భద్రతా సిబ్బంది అలర్ట్ చేయడంతో.. సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. విషయం తెలిసినవారంతా షాక్ కు గురవుతున్నారు.
Read Also: KTR: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!