రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. ఈ క్రమంలో స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల వద్దు బందోబస్తుగా ఉన్నారు. కాగా.. ఓట్ల లెక్కింపు మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
Read Also: Ambati Rambabu: నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బందిని ఉంచనున్నారు. అంతేకాకుండా.. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుంది. కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ఎన్నికల ఫలితాల్లో మొట్ట మొదట భద్రాచలం, చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితం వెళ్లడయ్యే అవకాశం ఉంది.
Read Also: HAL Recruitment 2023: హెచ్‌ఏఎల్ లో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.1,40,000..