రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది. ఈ క్రమంలో స్ట్రాంగ్‌రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల వద్దు బందోబస్తుగా ఉన్నారు.