Coronavirus India: కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: కేంద్ర ఆరోగ్య శాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre holds review meet after Coronavirus Cases increase in Kerala: కరోనా వైరస్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కేసుల పెరుగుదల, మరణాలపై సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల, ఆసుపత్రుల్లో వైద్య సేవల సంసిద్ధతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ… ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో ప్రతి 3 నెలలకోసారి మాక్‌డ్రిల్స్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్రాలకు కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. హెల్త్ ను రాజకీయ అంశంగా చూడొద్దు’ అని అన్నారు.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
Also Read: Poco M6 5G Launch: డిసెంబర్ 22 న పోకో ఎం6 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్!
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 341 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలోనే 292 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో వెలుగు చూసిన కొవిడ్-19 ఉపరకం జేఎన్-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జేఎన్-1 ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపించదని తెలిపింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!