NTV Telugu Site icon

Corona Cases: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

Corona

Corona

Corona Cases: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 60 వేలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 52 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క హైదరాబాద్‌లోనే 21 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.

Read Also: Medical College: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ‌వ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీకాల పంపిణీపై కేంద్రం చేతులెత్తేయ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేపటి (బుధవారం) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చేయనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ సరఫరా నిలిపివేయడంతో తెలంగాణ ప్రభుత్వం టీకాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. 5 ల‌క్షల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను ప్రజ‌ల‌కు రాష్ట్ర సర్కారు అందుబాటులోకి తెచ్చింది. బుధ‌వారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మొద‌టి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్‌గా కార్బే వ్యాక్స్ తీసుకోవ‌చ్చని అధికారులు తెలిపారు.