NTV Telugu Site icon

Hyderabad: జీహెచ్ఎంసీ ఆఫీసులో కాంట్రాక్టర్ల నిరసన.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం..!

Ghmc

Ghmc

హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే.. గమనించిన అక్కడున్న పోలీసులు అడ్డుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Imanvi : ప్రభాస్ ‘ఫౌజీ’ తర్వాత బ్యూటీ క్వీన్ ఇమాన్వి లైనప్‌ చూస్తే కంగు తినాల్సిందే!

మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న కాంట్రాక్టర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఎంతవరకైనా సిద్ధం అని కాంట్రాక్టు నాయకులు చెబుతున్నారు. కమిషనర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో.. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసన చేస్తున్న కాంట్రాక్టర్లతో మాట్లాడి విరమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

Read Also: Sankranti Movies : ఇప్పటి వరకు సంక్రాంతి కింగ్ హనుమానే.. ఆ రికార్డు బ్రేక్ అవుతుందా ?

కాంట్రాక్టర్ల నిరసనకు జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించారు. యూనియన్ లీడర్లను చర్చలకు అనుమతించారు కమిషనర్ ఇలంబరితి. ఈ క్రమంలో కమిషనర్‌తో చర్చలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్స్ యూనియన్ నాయకులు లోపలికి వెళ్లారు. చర్చలు పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిరసన ఆపారు.

Show comments