తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్‌మెంట్‌లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడ్డారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి ఇప్పుడు తిరుమలలో కనిపించడం లేదు. తిరుమలలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 17 కంపార్లుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే దర్శన టోకెన్ లేని భక్తులకు 12 గంటల దర్శన సమయం పడుతోంది.
Read Also: Pushpa 2 : క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా..?
అయితే, తిరుపతిలో టైంస్లాట్ సర్వ దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తి అవుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తైతుంది. తిరుమలలో రూమ్స్ పొందేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. అలాగే, శుక్రవారం నుంచి సోమవారం వరకు 3 లక్షల 25 వేల 526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. లక్షా 53 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే, నిన్న ఒక్క రోజే శ్రీవారిని దర్శించుకున్న 76, 381 మంది భక్తులు.. 33, 509 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు లభించింది.