NTV Telugu Site icon

Facebook Friend: అమెరికా యువతితో ఫేస్బుక్లో పరిచయం.. ఇండియాకు రప్పించి అత్యాచారం

Face Book

Face Book

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో అమెరికా మహిళపై అత్యాచారం జరిగిన ఉదంతం వెలుగు చూసింది. పెళ్లయిన ఓ లాయర్ అమెరికాకు చెందిన అమ్మాయితో ఫేస్‌బుక్‌లో స్నేహం చేశాడు. తనకు పెళ్లికాలేదని యువతిని భారత్‌కు రప్పించాడు. జైపూర్, అజ్మీర్ సహా పలు చోట్ల హోటళ్లలో యువతికి సౌకర్యం కల్పించాడు. ఈ క్రమంలో అమెరికా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి అబద్ధపు మాటలు చెబుతూ వచ్చాడని యువతి తెలిపింది. ఈ క్రమంలో.. నిందితుడు మోసం చేశాడని తెలిసుకుని బాధిత మహిళ బుండిలోని ఎన్జీవోను సంప్రదించి.. బుండి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై అజ్మీర్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్‭ను తీసుకొచ్చిన షియోమీ..

విదేశీ మహిళపై అత్యాచారం వార్త కలకలం సృష్టించింది. దీంతో.. పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు. బుండి సిటీ సీఓ అమర్ సింగ్, సదర్ ఇంచార్జి భగవాన్ సహాయ్ మీనా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విషయం తెలుసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అష్మీన్ బానో మాట్లాడుతూ.. బాధితురాలు బుండి ఎన్‌జిఓ ద్వారా పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని, అక్కడ తనకు జరిగిన సంఘటన గురించి ఆమె సమాచారం ఇచ్చిందని చెప్పారు. వెంటనే విచారణ సందర్భంగా లిఖిత పూర్వకంగా నివేదిక తీసుకుని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హనుమాన్ మీనాకు పూర్తి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి, అర్థరాత్రి బూండీ ఆస్పత్రిలో విదేశీ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Google Maps: గూగుల్ మాప్స్ లో కొత్త ఫీచర్స్…ఇక నుంచి ఫ్లైఓవర్ అలర్ట్

తనకు పెళ్లికాలేదని నిందితుడు ఫేస్‌బుక్‌ ద్వారా తనతో స్నేహం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొంది. కాగా.. మోసం చేసిన వ్యక్తి మానవ్ రాథోడ్ అజ్మీర్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయిందని, అయితే ఫేస్‌బుక్ ద్వారా అమెరికా యువతితో స్నేహం ఏర్పడిందని చెప్పారు. దీంతో.. బాధితురాలు ఇటీవల భారత్‌కు వచ్చిందన్నారు. ఒకరోజు నిందితుడుని బాధితురాలు కలిసిన తర్వాత.. తనకు పెళ్లై పిల్లాడు కూడా ఉన్నట్లు బాధిత మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మోసపోయానని ఆ మహిళ ఎన్జీవో సాయం కోరిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత.. మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై యువతి కంప్లైంట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.