Conistable : వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” . వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి పరిచయం కానున్నారు. “కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా” అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. దీనికి శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు” అని అన్నారు.. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. “సి వి ఆనంద్ ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను” అని అన్నారు.
Read Also:Gold Prices: పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాడించాం. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. .
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ..‘‘ మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుంది.’’ అని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం.
Read Also:Bhatti Vikramarka:”తెలంగాణకు అన్యాయం” పద్మ అవార్డులపై డిప్యూటీ సీఎం రియాక్షన్…