Site icon NTV Telugu

Bhadradri Kothagudem: బీఆర్ఎస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నేతలు.. కుర్చీలు, సామగ్రి దగ్ధం..

Brs

Brs

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్‌ని కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జండాలు బయటికి తీసుకొచ్చి కాల్చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. నాడు అధికారం అండతో రేగా కాంతారావు చేసిన చర్యను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోలేకపోయారు.

READ MORE: NV Ramana: “నా కుటుంబాన్ని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారు”.. జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు..

అప్పటి నుంచి ఆ కార్యాలయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కార్యాలయం కోసం కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త స్థలాన్ని డొనేట్ చేశారు. ఆ స్థలంలో కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఇది తానే నిర్మించానని.. తనకే చెందుతుందని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చేశారు రేగా కాంతారావు. అయితే మొన్నటి ఎన్నికల్లో రేగా కాంతారావు ఓడిపోయిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో ఉత్తేజం వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఈ కార్యాలయంలోకి చొరబడి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాగ్రి, కుర్చీలు బయటకు తెచ్చి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

READ MORE: Raj Thackeray: ప్రతిపక్ష కూటమితో చేరిన రాజ్ ఠాక్రే..

Exit mobile version