Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur Panchayat Elections : సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బువాంకులేల సొంత జిల్లా నాగ్‌పూర్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయపార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ సత్తా చాటింది. అధిక స్థానాలను కైవసం చేసుకుంది. నాగపూర్ జిల్లా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం కావడం గమనార్హం. అలాంటి నాగ్‌పూర్‌లోనే ఇలాంటి ఫలితాలు రావటం బీజేపీకి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also: Muslim Girl: మేజర్ కాకుండానే పెళ్లికి అర్హులా..? తేల్చనున్న సుప్రీంకోర్టు
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
నాగ్‌పూర్ జిల్లాలో పంచాయతీ చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం.. బీజేపీ వీటిల్లో ఒక్క చైర్పర్సన్ పదవినీ పొందలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్పర్సన్ సీట్లకే పరిమితమైంది.
Read Also: PM Modi: 23న అయోధ్యలో మోదీ పర్యటన.. 15లక్షల మందితో దీపోత్సవ వేడుక
మొత్తం 13 చైర్పర్సన్ పోస్టులకు గానూ హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 13 డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు గానూ ఎనిమిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఇక నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) మూడు చైర్పర్సన్ పదవులను గెలుపొందింది. శివసేన ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ గెలుపొందిన వాటిలో సావోనేర్, కల్మేశ్వర్, పార్సియోని, మౌడా, కాంప్టీ, ఉమ్రేడ్, భివాపూర్, కుహి, నాగ్‌పూర్ రూరల్ లు ఉన్నాయి. కటోల్, నార్ఖేడ్, హింగ్నా స్థానాలను ఎన్‌సిపి గెలుచుకున్నది. రామ్‌టెక్ చైర్పర్సన్ పదవిని శివసేన గెలుచుకున్నది. రామ్టెఖ్ సీటును ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని ‘బాలాసాహేబంచి శివ సేన’ సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!