Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి

Mnagpur

Mnagpur

Nagpur Panchayat Elections : సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బువాంకులేల సొంత జిల్లా నాగ్‌పూర్‌‎లో బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయపార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ సత్తా చాటింది. అధిక స్థానాలను కైవసం చేసుకుంది. నాగపూర్ జిల్లా బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కేంద్రం కావడం గమనార్హం. అలాంటి నాగ్‌పూర్‌‎లోనే ఇలాంటి ఫలితాలు రావటం బీజేపీకి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also: Muslim Girl: మేజర్ కాకుండానే పెళ్లికి అర్హులా..? తేల్చనున్న సుప్రీంకోర్టు

నాగ్‌పూర్‌ జిల్లాలో పంచాయతీ చైర్‌పర్సన్లు, డిప్యూటీ చైర్‌పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం.. బీజేపీ వీటిల్లో ఒక్క చైర్‌పర్సన్‌ పదవినీ పొందలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్‌పర్సన్‌ సీట్లకే పరిమితమైంది.

Read Also: PM Modi: 23న అయోధ్యలో మోదీ పర్యటన.. 15లక్షల మందితో దీపోత్సవ వేడుక

మొత్తం 13 చైర్‌పర్సన్‌ పోస్టులకు గానూ హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 13 డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవులకు గానూ ఎనిమిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఇక నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మూడు చైర్‌పర్సన్‌ పదవులను గెలుపొందింది. శివసేన ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్‌ గెలుపొందిన వాటిలో సావోనేర్‌, కల్మేశ్వర్‌, పార్సియోని, మౌడా, కాంప్టీ, ఉమ్రేడ్‌, భివాపూర్‌, కుహి, నాగ్‌పూర్‌ రూరల్‌ లు ఉన్నాయి. కటోల్‌, నార్ఖేడ్‌, హింగ్నా స్థానాలను ఎన్‌సిపి గెలుచుకున్నది. రామ్‌టెక్‌ చైర్‌పర్సన్‌ పదవిని శివసేన గెలుచుకున్నది. రామ్‌టెఖ్‌ సీటును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని ‘బాలాసాహేబంచి శివ సేన’ సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.