Site icon NTV Telugu

Assam CM: కాంగ్రెస్ అయోధ్యలో రామమందిరం స్థానంలో మరోసారి బాబ్రీ మసీదును నిర్మిస్తుంది..

Assam Cm

Assam Cm

Lok Sabha Elections 2024: అయోధ్యలో రామమందిరం స్థానంలో కాంగ్రెస్ మరోసారి బాబ్రీ మసీదును నిర్మించగలదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. ఒడిశాలోని మల్కన్‌గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాకు 400 సీట్లు ఎందుకు కావాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, మసీదుల పునర్నిర్మాణాన్ని ఆపాలంటే ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు గెలవాలని చెప్పారు. ఈ దేశంలో మళ్లీ బాబ్రీ మసీదు కట్టకుండా చూసుకోవాలి.. అందుకే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేయాలి అని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కోరారు.

Read Also: Amritpal singh: ఎంపీగా పోటీ చేయనున్న ఖలిస్థానీ ఉగ్రవాది.. తాత్కాలిక బెయిల్ కోసం కోర్టుకు..!

కాగా, గతంలో కాంగ్రెస్ రామమందిర నిర్మాణ తేదీని అడిగేదని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మేము మరోసారి అధికారంలోకి వస్తే.. రామ మందిరం దగ్గర మాత్రమే ఆగబోమని కాంగ్రెస్‌కు తెలుసు.. మన దేశంలోని ప్రతి దేవాలయానికి విముక్తి కల్పిస్తామన్నారు. మోడీకి 400 సీట్లు వస్తేనే.. కాంగ్రెస్‌ ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాదన్నారు. రామ మందిరానికి తాళం వేయకుండా ఉండాలంటే మోడీకి 400 సీట్లు కావాలని హిమంత బిశ్వశర్మ అన్నారు. ఇక, 2019లో అయోధ్యలోని రామ మందిర వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో, రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Exit mobile version