Site icon NTV Telugu

Congress vs SP: కాంగ్రెస్-ఎస్పీ మధ్య చర్చలు విఫలం.. మూడు సీట్ల విషయంలోనే..!

Up

Up

ఇండియా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత లోక్‌సభ స్థానాల పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్‌లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పొత్తు ఉండదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా.. ఈ విషయాన్ని రెండు పార్టీలు ప్రకటించలేదు.

Alla Ramakrishna Reddy Back To YSRCP: అందుకే మళ్లీ వైసీపీలో చేరా.. మూడోసారి విజయం మాదే..!

మరోవైపు.. కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకాల వ్యవహారం తేలెంత వరకూ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో తమ పార్టీ పాల్గొనేది లేదని అఖిలేష్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని సీట్లలోనూ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. కేవలం మొరాదాబాద్ నియోజకవర్గం విషయంలో తగ్గేదే లేదంటున్నారు. బిజ్నోర్ స్థానాన్ని కాంగ్రెస్ కోరుతుండగా.. మొరాదాబాద్ కానీ, బిజ్నోర్‌ కానీ ఇచ్చేందుకు ఎస్‌పీ నిరాకరిస్తోంది.

Sundaram Master: హర్షని అలా ఎప్పుడూ చూడలేదు.. ‘సుందరం మాస్టర్’ పెద్ద హిట్ అవ్వాలి

మరోవైపు.. ఇప్పటికే పొత్తులో భాగంగా రాష్ట్రంలో 17 లోక్ సభ సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఎస్‌పీ సోమవారంనాడు ప్రతిపాదన చేసింది. అయితే కాంగ్రెస్ మాత్రం కనీసం 20 సీట్లు కావాలని పట్టువిడవని విక్రమార్కుడిలా ఉంది. అంతకుముందు 11 సీట్లు కాంగ్రెస్‌కు ఆఫర్ చేసినప్పటికీ ఆ పార్టీ మరిన్ని సీట్ల కోసం పట్టుబట్టింది. కాగా, కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిన కీలక నియోజకవర్గాల్లో అమేథి, రాయబరేలి, వారణాసి, ప్రయాగ్‌రాజ్, డియోరియా, బాన్స్‌గావ్, మహారాజ్‌గంజ్, బారాబంకి, కాన్పూర్, ఝాన్సీ, మథుర, ఫతేపూర్ సిక్రి, ఘజియాబాద్, బులంద్‌షహర్, హథ్రాస్, షహరాన్‌పూర్ ఉన్నాయి.

Exit mobile version