Sundaram Master: హర్షని అలా ఎప్పుడూ చూడలేదు.. ‘సుందరం మాస్టర్’ పెద్ద హిట్ అవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో సిద్దు జొన్నలగడ్డ బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు.సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్ ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. హర్షని ఓ కమెడియన్ అని చెప్పడం నాకు నచ్చదు. అతను ఓ కామిక్ యాక్టర్. ఓ సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌కు ఈ తొలి ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి. ఈ సినిమాను నిర్మించిన రవితేజ గారికి థాంక్స్. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇలా కొత్త వాళ్లని ఎంకరేజ్ చేసేందుకు సినిమాలు నిర్మిస్తున్నారు. కలర్ ఫోటో, మంత్ ఆఫ్ మధు, బేబీ ఇలా ఎప్పటికప్పుడు హర్ష తనకి తాను నటుడిగా నిరూపించుకుంటూ వస్తున్నారు. నాకు హర్ష పర్సనల్‌గా కూడా తెలుసు. ఆఫ్ స్క్రీన్‌లోనూ బాగా నవ్విస్తుంటాడు. ట్రైలర్‌లో చూసినట్టుగా హర్షని సీరియస్‌గా ఎప్పుడూ చూడలేదు. హీరోయిన్ దివ్య శ్రీపాదకు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
Also Read;Varun Tej: జనసేనకు సపోర్ట్ చేస్తా, కానీ పవన్ సినిమాలో అలా చేస్తే చంపేస్తారు!
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. నాగ చైతన్య పాటను, సాయి ధరమ్ తేజ్ టీజర్‌ను లాంచ్ చేశారు. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి , రవితేజ , సిద్దు జొన్నలగడ్డ మాకు సపోర్ట్‌గా నిలిచారు. పదేళ్ల క్రితం ఆ ఆడియెన్స్ మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం. ఫిబ్రవరి 23న మా చిత్రాన్ని థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ.. ‘మా సినిమా పోస్టర్లు, టీజర్,ట్రైలర్‌లు అందరికీ నచ్చాయి. ఈ సినిమాలోని ఇన్నోసెన్స్ వల్లే అందరికీ నచ్చింది. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా ఎడిటర్ ఈ సినిమా కోసం చాలా వర్షన్స్ కట్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ సెట్స్‌ను ఎంతో అద్భుతంగా పని చేశారు. ఎంతో సహజంగా సెట్ వేశారు. ఏడాదిన్నరకు పైగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేశాం. అంతా స్నేహితులమే కాబట్టి కలిసి పని చేశాం. మా డీఓపీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మా అందరిలోనూ శ్రీ చరణ్ పాకాల గారే సీనియర్. ఆయన చాలా సపోర్ట్ చేశారు. రవితేజ మాకు అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేం. సుధీర్ అన్న నాకు 8 ఏళ్లుగా తెలుసు. ఆయన దర్శకుడిగా ట్రై చేస్తూ ఉన్నా కూడా జూనియర్ అని చూడకుండా నా కథకు సపోర్ట్ ఇచ్చారు. మా అందరినీ బలంగా నమ్మి హర్ష మాకు సపోర్ట్ చేశారు. చిరంజీవి , నాగ చైతన్య , సిద్దు మా సినిమాకు సపోర్ట్ చేశారంటే అది హర్ష గారి వల్లే. కలర్ ఫోటో సినిమా చూశాక హర్ష గురించి నాకు ఓ మీమ్ కనిపించింది. బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నార్రా అనే మీమ్ కనిపించింది. మేం మాత్రం బంగారమే వేశాం. దివ్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె అద్భుతంగా నటించారు. ప్రకృతి అందరికీ ఒకేలా కనిపించదు. రైతుకు వర్షం అన్నం పెడితే.. రోడ్డు పక్కన బిజినెస్ చేసేవాళ్లకు ఫుడ్ లాక్కుంటుంది. అలా ఈ సినిమాను ఎన్నో కోణాల్లో చూపించాం. ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానీ.. మా అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. సినిమాను చూసిన వారందరికీ ఓ సంతృప్తిని మాత్రం ఇస్తుంది’ అని అన్నారు.
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. ట్రైలర్ చూస్తే యూనిక్ వైబ్ కనిపించింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం రాబోతోంది. సిద్దు ఎక్కడుంటే అక్కడ వైబ్రేషన్ ఉంటుంది. ఈ చిత్రంతో హర్ష అన్ని రకాల పాత్రలను పోషించగలడని నిరూపించుకోవాలి. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘హర్ష అద్బుతమైన నటుడు. హీరోగా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీచరణ్ పాకాల సంగీతమంటే నాకు చాలా ఇష్టం. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘2013లో వైవా హర్ష షార్ట్ ఫిల్మ్ వచ్చాక నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. రంగు ముఖ్యం కాద కంటెంట్ ఉంటే జనాలు చూస్తారని అర్థమైంది. 2015లో సుహాస్‌తో కలర్ ఫోటో స్టార్ట్ చేసినప్పుడు హర్ష మాకు ఇన్‌స్పిరేషన్. ఇప్పుడు హీరోగా సుందరం మాస్టర్‌తో హర్ష ఎన్నో రూల్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. దివ్య కూడా ఫ్రెండ్ కారెక్టర్ల నుంచి హీరోయిన్‌గా మారింది. క్షణం నుంచి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని ఇష్టపడుతూనే ఉన్నాను. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!