Bihar Elections 2025: బీహార్ సమరానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!
- జాబితాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, ముఖ్యమంత్రులు..
- 40 మందితో విడుదల చేసిన జాబితా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: బీహార్ సమరానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరం సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ అయ్యి, అనేక హామీలను గుప్పిస్తున్నారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో వరుస ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నాయి. ఇదే సమయంతో మొదటి దశకు ఎన్నికలకు పోటీ పడుతున్న మహా కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల లీస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..
READ ALSO: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. Realme GT 8 Pro ధర, ఫీచర్స్ ఇలా!
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
40 మంది స్టార్ క్యాంపెయినర్లు..
తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఉన్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు. హస్తం పార్టీ విడుదల చేసిన జాబితాలోని ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు మహిళల్లో బాగా ప్రాచుర్యం ఉంది. వీళ్లద్దరూ నాయకులు మహిళలను ఆకర్షించడంపై దృష్టి పెడతారని కూటమి సభ్యులు నమ్ముతారు. రాష్ట్రంలో ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన యాత్రలో కూడా ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహించనున్న మొదటి దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిందన్నారు. ప్రచారకుల జాబితాలో కె.సి. వేణుగోపాల్, సుఖ్విందర్ సింగ్ సుఖు, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘేల్, దిగ్విజయ్ సింగ్ ఉన్నారని పేర్కొన్నారు. వీరితో పాటు అధీర్ రంజన్ చౌదరి, మీరా కుమార్, కృష్ణ అల్లవారు, సచిన్ పైలట్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చరణ్‌జిత్ సింగ్ చన్నీ, గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, డాక్టర్ మహమ్మద్ జావేద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, మనోజ్ రామ్, అల్కా లాంబ, పవన్ కే షగర్రప్ కుమార్, కణ్హయ్య, కణ్హయ్య అహ్మద్, జితు పట్వారీ, సుఖ్‌దేవ్ భగత్, రాజేష్ కుమార్ రామ్, షకీల్ అహ్మద్ ఖాన్, మదన్ మోహన్ ఝా, అజయ్ రాయ్, జిగ్నేష్ మేవానీ, రంజీత్ రంజన్, రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్, అనిల్ జైహింద్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఫుర్కాన్ అన్సారీ, ఉదయ్ భాను చిబ్, సహా భాను చిబ్ ఉన్నారు.
రాష్ట్రంలో ఓటింగ్ ఎప్పుడు అంటే..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు చేపట్టనున్నారు. మొదటి దశ నామినేషన్లు అక్టోబర్ 17న ముగియగా, రెండవ దశ నామినేషన్లు సోమవారం ముగిశాయి. సీట్ల పంపకంపై మహా కూటమి ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Afghanistan: భారతదేశంపై పాక్ ఆరోపణలకు తాలిబన్ మంత్రి దిమ్మతిరిగిపోయే ఆన్సర్..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?