NTV Telugu Site icon

Chinta Mohan: చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌దే గెలుపు..

Chinta Mohan

Chinta Mohan

Chinta Mohan: అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. అయోధ్య ఈవెంట్‌తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో ఆడ బిడ్డలను గుండెలపై తన్నడం జగన్ పరిపాలనకు నిదర్శనమని విమర్శలు గుప్పించారు. ఏపీ రాజకీయాల్లో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయని.. ప్రజల్లో పరివర్తన కనిపిస్తోందన్నారు.

Read Also: Kesineni Chinni: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని

ఎస్సీ ఎస్టీ విద్యార్థులు బీటెక్‌లు పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు కాంగ్రెస్ పార్టీని పార్టీని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి‌ని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందన్నారు. జగన్ తన సొంత చెల్లెలితో గొడవల్ని సర్దుబాటు చేసుకోలేకపోయాడన్నారు. షర్మిలను విమర్శిస్తే మాకు విమర్శించడం తెలుసన్నారు. ఏపీలో 130 అసెంబ్లీ స్ధానాలు ,20 లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ గెలవబోతోందని చింతా మోహన్‌ ధీమా వ్యక్తం చేశారు.