Site icon NTV Telugu

Congress: యూపీలో 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు విడుదల.. రంగంలోకి సోనియా

Soien

Soien

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఇండియా కూటమిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో రంగంలోకి దిగాయి. ఇప్పటికే అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. అయితే యూపీలో అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Vodafone Idea: నాణ్యమైన 5జీ సేవలు అందిస్తాం

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్, తదితరులు మొత్తం 40 మందితో కూడిన జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇప్పటి వరకు రెండు విడతల్లో ప్రచారాలు ముగిశాయి.. కానీ ఇప్పటి వరకు సోనియా గాంధీ ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు. కానీ ఈసారి మాత్రం ఆమె రంగంలోకి దిగుతున్నారు. యూపీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో దంపతులు..

ఆరోగ్య రీత్యా ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక్కడ ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు పేరు ప్రకటించలేదు. అలాగే అమేథీ సీటు కూడా ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ సోనియా అల్లుడు, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. చివరికి రాహుల్ రంగంలోకి దిగుతారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఇక ప్రచారంలో ఆయా పార్టీలు దూసుకుపోతున్నాయి.

D

Exit mobile version