Site icon NTV Telugu

Kharge: ప్రధాని మోడీకి ఖర్గే లేఖ.. దేనికోసమంటే..!

Deeeee

Deeeee

సార్వత్రిక ఎన్నికల వేళ అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు-ప్రతివిమర్శలతో ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ లక్షంగా మాటల తూటాలు పేలుస్తోంది. కాంగ్రెస్.. మోడీ టార్గెట్‌గా విమర్శ బాణాలు సంధిస్తోంది. ఇలా ఎన్నికల ప్రచారాన్ని భగభగ మండే ఎండకాలంలో మరింత హీట్ పెంచేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రకటించిన మానిఫెస్టో‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీ చెలరేగడానికి కారణం అదే: గౌతమ్ గంభీర్

అలాగే ప్రధానికి తగినట్టుగా భాష మాట్లాడాలని మోడీకి సూచించారు. ఓటర్లు సత్యాన్ని గ్రహించే మేధావులని తెలిపారు. అబద్ధాన్ని పునరావృతం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, బీజేపీ నేతలు చాలా నిరాశ, నిస్పృహల్లో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఖర్గే లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Breking News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్..

సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించింది. ఆయా వర్గాల లక్ష్యంగా హామీలు వెల్లడించింది. మహిళలు, బీసీల కోసం ప్రత్యేకమైన వరాలు ప్రకటించింది. మహిళలకు ఏడాదికి రూ.లక్ష సాయం. అలాగే రిజర్వేషన్లు కల్పించింది. అలాగే బీసీల కోసం కూడా పథకాలు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని మోడీ, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే.. ప్రధాని మోడీకి లేఖ రాశారు.

Deeeee

Exit mobile version