Harish Rao: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కిపోతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ అని అన్నారు. అధికారం మీద యావ ఎక్కువ అన్నారు. అబద్దాలతో అధికారం లోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ తో జాగ్రత్త గా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇస్తే 10ఏళ్ళు వెనక్కి పోతామని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే మన ఏళ్ల తో మన కన్ను పొడుచుకున్నట్టే అని తెలిపారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు శ్రీరామరక్ష సీఎం కేసీఆర్ పాలన అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కంటే కాంగ్రెస్ అధికారాన్ని ఎక్కువగా ప్రేమిస్తోందని విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. రైతుబంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి పాలనలో కరువు కాటకాలతో సతమతమయ్యేవారని, నేడు హరితహారంగా మార్చామన్నారు. పొరపాటున అయినా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేళ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. దీంతో తెలంగాణ నేడు అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా ఉందని తేలింది. బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో అద్భుతం. కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామన్నారు. రైతుబంధు, ఆసరా పింఛన్లు పెంచబోతున్నట్లు తెలిసింది. ఐక్య మెదక్ జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు.
House Rent Hike: భారీ పెరిగిన ఇంటి అద్దెలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే ?
Also Read
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!