కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిపై రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సంజీవ్ రెడ్డి, సుజాత, సాజిద్ ఖాన్ లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు తీసుకొని పారి పోయారని ప్రచారం చేస్తున్నావ్ నిరుపిస్తావా.. ప్లేస్ సమయం డిసైడ్ చేయి అంటూ సవాల్ చేశారు. నోరు నాకుంది.. ఎక్కువ మాట్లాడితే ఖబడ్దార్ అంటూ మండిపడ్డారు. ప్రతిష్ఠను దిగజార్చే విధంగా మాట్లాడితే ఉరుకోము.. కోట్ల రూపాయలు అమ్ముడు పోయావు అనే ఆరోపిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి నిరూపించక పొతే చెప్పు దెబ్బలు తింటావు అంటూ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నేత జీ సుజాత్ చెప్పు చూపించింది. స్త్రీలను కించ పర్చిన కంది శ్రీనివాస్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలి.. ఇలాంటి నాయకుల్ని నిలదీయాలి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: World Cup 2023 Semi-Finals: సెమీస్ మ్యాచ్‌లపై వరుణుడి కన్ను.. వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
కంది శ్రీనివాస్ రెడ్డిని మహిళల పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా అని మాజీ కాంగ్రెస్ నేత సుజాత అన్నారు. ఇంతకు నీవు ఆడదానికి పుట్టినవా.. గాడిదకు పుట్టినవా అని ఆమె ప్రశ్నించారు. మేము ప్రజల పక్షాన పోరాటం చేసింది మేము అని సుజాత తెలిపారు. ప్రజా సేవ అంటే ఏది అశించకుండా చేసేది.. నీ ప్రజా సేవ కాంగ్రెస్ టికెట్ కొనుక్కున్నా.. రేవంత్ రెడ్డిని కొనుకున్నా అనే విధంగా ఉంది అని ఆమె మండిపడ్డారు. మా ప్రతిష్ట దిగజార్చాలని చూస్తున్నావో ప్రజలందరు గమనిస్తున్నారు.. అస్సలు పాయ శంకర్ కానీ, జోగు రామన్న దోచుకున్నారు అని విమర్శిస్తున్నావు.. మరీ నీవు దొంగ కంపెనీలు పెట్టావు కదా అంటూ మాజీ కాంగ్రెస్ నేత సుజాత ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తునే.. తాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని.. అస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేశామని మాజీ కాంగ్రెస్ నేత సుజాత తెలిపారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.