MP Imran Masood: “పార్లమెంట్లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను”.. ఎంపీ ఇమ్రాన్ సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Imran Masood: “నేను పార్లమెంట్లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను” ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వాతంత్య్రోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘వందే మాతరం’ గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “వందే మాతరం ఇప్పటికే పాడుతున్నాం. కానీ అన్ని ఆరు చరణాలు చదవాలని చెబితే నేను చదవలేను. ఎందుకంటే నా మతం దానికి అనుమతించదు. నాకు ఇక్కడ(పార్లమెంట్) ఆవరణలో సజ్దా(ఇస్లామిక్ ప్రార్థన) చేయడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ నా మతం ఏమి చెబుతుందో అది పాటించే స్వేచ్ఛను నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది” ఎంపీ అని అన్నారు. ఇమ్రాన్ మసూద్ ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రస్తావించారు. దేశానికి గౌరవం ఇవ్వడంలో తాను వెనుకాడనని, కానీ తన మత పరిమితులను దాటలేనని స్పష్టం చేశారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మాత్రమే కాకుండా, సమాజంలో కూడా పెద్ద చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.
READ MORE: Maha Shivratri 2026: మహాశివరాత్రి ఉపవాసం విరమించడానికి శుభ సమయాలు ఇవే.. ఈ తప్పులు చేయకండి!
Also Read
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
- Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
మరోవైపు… వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు ఏకపక్షం, నిర్హేతుకమని ప్రముఖ ముస్లిం సంస్థ జమీయత్ ఉలామా-ఏ-హింద్ వ్యాఖ్యానించింది. ఇది రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛపై దాడి అని జమీయత్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ‘‘వందేమాతరం పాడకుండా ముస్లింలు ఎవరినీ నిరోధించరు. కానీ గేయంలోని కొన్ని చరణాలు మాతృభూమిని ఓ దేవతలా స్తుతించేలా ఉన్నాయి. ఇది ఇస్లాం లాంటి ఏకధర్మ మతాల ప్రాథమిక విశ్వాసానికి విరుద్ధం. ఆర్టికల్ 25తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను ఇది ఉల్లంఘిస్తోంది. కేంద్రం ఆదేశాలు మైనార్టీల రాజ్యాంగ హక్కులను హరించే యత్నం’’ అని మౌలానా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?