NTV Telugu Site icon

MLC Jeevan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌ను కాపాడడం ఎవరి తరం కాదు..

Mlc Jeevan Reddy

Mlc Jeevan Reddy

MLC Jeevan Reddy: బీజేపీ మిత్రపక్షం అయిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే.. సీబీఐ విచారణ కోరుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎలా బీజేపీకి కొమ్ముకాసిందో చూశామని.. అందుకు ప్రతిఫలంగా కేసీఆర్‌ను కాపాడాలని బీజేపీ చూస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు పాలనలో కాళేశ్వరం మీద కేంద్ర బృందాలతో నివేదికలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం మీద జ్యుడీషియల్ కమిటీ వేసి.. విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.

Read Also: Lok Sabha Election: ఐటీ శాఖ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సీజ్ చేసిందంటే..!

ఈడీ, ఐటీ, సీబీఐలతో కేసులు పెట్టు వేధించి.. పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్‌లో నుంచి కాపాడటం ఎవరి తరం కాదన్నారు. బీఎల్ సంతోష్‌ను ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఇరికించారని చెబుతున్నారు కదా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ఇందులోనే బీజేపీ చిత్తశుద్ధి అర్థం అవుతుందన్నారు.బీఆర్‌ఎస్‌ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకున్నారని.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ డ్రామాలు ఇప్పటికైనా ఆపాలన్నారు.

Show comments