Site icon NTV Telugu

Attack on MLA: మద్యం మత్తులో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్

Attack On Mla

Attack On Mla

Attack on MLA: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి జరిగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో ఆదివారం ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఖిలేశ్వర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఖుజ్జి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఒక బహిరంగ కార్యక్రమానికి హాజరవుతుండగా ఈ సంఘటన జరిగింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Read Also: Adani Group: అదానీ గ్రూప్‌నకు ముగిసిన హిండెన్‌బర్గ్ శాపం.. మూడు నెలల్లో 70శాతం లాభం

ప్రాథమిక సమాచారం ప్రకారం సాహు వేదికపై ఉండగా మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సాహు మణికట్టుకు స్వల్ప గాయాలు కావడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చురియాకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనను ఖండిస్తూ ఛత్తీస్‌గఢ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే భద్రత లేనప్పుడు సామాన్యుల భద్రత మాటేమిటని ప్రశ్నించారు. ఇది భూపేశ్ బఘేల్ ప్రభుత్వ వైఫల్యమ‌ని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version