Site icon NTV Telugu

V.Hanumantha Rao: అది బీజేపీ.. ఇది భారత్ రాష్ట్ర సమితి.. అంటే అది ఏ టీం.. ఇది బీ టీం..

V Hanumantha Rao

V Hanumantha Rao

V.Hanumantha Rao: రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్‌ను వీహెచ్‌ కొనియాడారు. సోనియా గాంధీ తన కుమారుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దన్నా కొడుకు దగ్గరకు వెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారని చెప్పారు. ఆమె ఆరోగ్య రీత్యా మంచిది కాదని రాహుల్ చెప్పారని.. కానీ వినకుండా దేశం కోసం యాత్రలో పాల్గొన్నారన్నారు. ఆమె షూ లేస్‌ను రాహుల్‌ కట్టారన్నారు. కేటీఆర్ ఫ్యామిలీ జోడో చేసుకోవాలని.. ప్రజల గురించి ఆలోచించాలన్నారు.

KTR Chit Chat: 2024 పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్.. ప్రజలకు ఏం కావాలో అవే అజెండా..

అది బీజేపీ.. ఇది భారత్ రాష్ట్ర సమితి అని.. అంటే అది ఏ టీం..ఇది బి టీం అని ఆయన విమర్శించారు. ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతా అంటున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీని కొట్టాలంటే సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటి పైకి రావాలన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటన్నారు. 1969లో పోలీసు తూటాలకు చనిపోయిన వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసమే కొత్త పార్టీ అంటూ వీహెచ్‌ విమర్శించారు.

Exit mobile version