బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెటిలర్లు అనే పదం తాను వాడనని.. ఇక్కడే పుట్టిన బిడ్డగా నాకెంత హక్కు ఉందో ఇక్కడ వచ్చి నివసిస్తున్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంటుందని అన్నారు. మెదక్ లో పుట్టి గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లాకు వెళ్లిన పారాచుట్లు కల్వకుంట్ల కుటుంబమని దుయ్యబట్టారు. ఉద్యమంలో తెలుగు ప్రజలను నువ్వు మీ నాన్న కేసీఆర్ బండ బూతులు తిట్టింది మర్చిపోలేదని అన్నారు. శ్రీకాంతాచారి ఒళ్ళు తగలబడి పోతుంటే వ్యాపారాలు చేసుకున్న వాళ్లు కవిత, తారకరామారావు అని మండిపడ్డారు.
Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ఆగి ఉన్న రైలును ఢీకొన్న పలాస ఎక్స్ ప్రెస్
కమాండో లాగా సోనియాగాంధీ ఆదేశిస్తే.. సిఫాయిలాగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించింది మధు యాష్కి గౌడ్ అని అన్నారు. ఎల్బీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అద్దెకు తెచ్చిన వాళ్లతో నిర్వహించిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాటలు దొంగలే సిగ్గు పడేట్లుగా ఉన్నవని.. అంగట్లో పశువులా అమ్ముడుపోయిన సుధీర్ రెడ్డి గొప్ప నాయకుడు అనడం హాస్యాస్పదమని విమర్శించారు.
Poliemera 2: ముందు మేమే.. మా తరువాతే కాంతార, విరూపాక్ష..
కేటీఆర్ మాట్లాడేవన్ని పచ్చి అబద్ధాలని మధుయాష్కీ అన్నారు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా.. కేటీఆర్, సుధీర్ రెడ్డి అధికార అహంకారంతో భూకబ్జాలు దౌర్జన్యాలు చేస్తు వాటాలు పంచుకుంటున్నారని తెలిపారు. జాగృతి కవిత స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 800 కోట్ల అక్రమార్జన చేసిందని ఆరోపించారు. తెలంగాణకు ముందు జనం మనం అన్న వీళ్లు.. గెలిచాక ధనం మనం అంటున్నారని దుయ్యబట్టారు. ప్రజల గుండెల్లో బాధలు ఉన్న ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేద్దామన్న ఎవరికీ చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. ఎల్బీనగర్ నుండి గెలిచి లాల్ బహుదూర్ నగర్ నియోజకవర్గాన్ని కమిషన్ ఏజెంట్లు, కబ్జాదారుల నుండి విముక్తి కల్పిస్తానని మధుయాష్కీ తెలిపారు.