Poliemera 2: సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1 .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అయ్యింది. అప్పట్లోనే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చేతబడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్విస్ట్ లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ గా రాబోతున్న పొలి మేర-2 పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేశారు.
Pragathi: అతనితో రెండో పెళ్లి.. ఎవడ్రా చెప్పింది.. చీప్ రాతలు రాయకండి
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో సత్యం రాజేష్, డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇక కాంతార, విరూపాక్ష మిమ్మల్ని ఎంతవరకు ఇంపాక్ట్ చేసాయి అన్న ప్రశ్నకు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ” మాది సక్సెస్ ఫుల్ బ్రాండ్.. అప్పుడు విరూపాక్ష లేదు, కాంతార లేదు. రెండేళ్ల క్రితం మా సినిమా సూపర్ డూపర్ హిట్. చేతబడులు కాన్సెప్ట్ తెచ్చిందే మేము. మా దాంట్లో మంత్రాలు ఉండవు, గాల్లో ఎగరడాలు ఉండవు.. దెయ్యాలు ఉండవు.. అవన్నీ కమర్షియల్ సినిమాలు. మాది ఒరిజినల్. వాళ్ళది వందకోట్లు సినిమాలు.. మాది చిన్న సినిమా . మా బడ్జెట్ కు.. మాకు వచ్చినదానికి మాకు వందకోట్లు వచ్చినట్లు లెక్క.. వాళ్ళు పెద్ద హీరోలు.. పెద్ద బ్యానర్ లు.. వాళ్లకు ఫ్యాన్స్ బేస్ ఉంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే వందమంది వెళ్తారు. నేను కూడా వాళ్లలో ఒకడిని ” అంటూ సత్యం రాజేష్ చెప్పగా.. డైరెక్టర్ మాట్లాడుతూ.. ” నేను పొలిమేర రాసే టైమ్ కు ఆ సినిమాలు రానే లేదు.” అనిచెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.