NTV Telugu Site icon

Jagga Reddy: బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌పై ఫైర్ అయిన జగ్గారెడ్డి

Jagga Reddy

Jagga Reddy

బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ విలీనం అవుతుంది అని లక్ష్మణ్ అనడం ఆయన అవగాహన రాహిత్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావచ్చు.. బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్‌లో మొదటి ర్యాంక్. మోడీ ఇచ్చిన హామీలపై మా ఎంపీ అనిల్‌తో చర్చకు రండి. బీజేపీ నేతలు శివలింగం మీద పాములాంటి వాళ్లు.. అందుకే ప్రజలు మొక్కుతున్నారు. శివలింగం దిగిన పాముకు పట్టిన గతే పడుతుంది.’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Raai Laxmi: అబ్బా.. రత్తాలు కొత్త లుక్ అదిరిపోయింది..

‘‘గతంలో ఎన్నికలు జరిగితే.. బీఆర్ఎస్ పోలీసులను వాడుకునేది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల కమిషన్‌కి సహకారం ఇచ్చింది . ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.. ఈ క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానిది, సీఎం రేవంత్‌రెడ్డిది. సోమవారమే ఎన్నికలు అయిపోయాయి .. ప్రెస్‌మీట్ ఎందుకులే అనుకున్నా.. కానీ బీజేపీ లక్ష్మణ్ అనవసరంగా మాట్లాడారు. ప్రజలు.. అంతా రిలాక్స్ అయ్యారు. కొంపలు మునిగినట్టు.. లక్ష్మణ్ మాట్లాడటం సరికాదు. లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీనా.. జోతిష్యం చెబుతున్నారా..? మూడు నెలల్లో ఏదో జరుగుతుంది అని మాట్లాడటం అవసరమా? ఆగస్టులో కాంగ్రెస్ సంక్షోభంలో పడుతుంది అని అంటున్నారు. ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు. ఆగస్టు సంక్షోభం అనేది.. ఒట్టి మాట. కాంగ్రెస్‌కి 64 మంది ఎమ్మెల్యేలతో అధికారం ఇచ్చారు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు.. బస్సులో మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు.. గ్యాస్ 500కి వస్తుంది. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం చెప్పారు.’’ అని జగ్గారెడ్డి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Snacks: 5 రూపాయిల కుర్కురే కొనివ్వలేదని భర్తను వదిలేసిన అర్ధాంగి

 

Show comments