Congress: ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం.. రాహుల్ అంశంపై చర్చ
- ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం
- రాహుల్ గాంధీ అంశంపై చర్చ
- వయనాడ్.. రాయ్‌బరేలీపై కాసేపట్లో కీలక ప్రకటన
- త్వరలో ప్రియాంక పొలిటికల్ అరంగ్రేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిపొందారు. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచారు. దీంతో ఈ రెండు స్థానాల్లోంచి ఏదో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోనున్నారు. ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈరోజే లోక్‌సభ సచివాలయానికి సమాచారం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరికాసేపట్లో కీలక ప్రకటన వెలువడనుంది. ఇదిలా ఉంటే ఈసారి లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ పదవిని రాహుల్‌కి అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ రాహుల్ మాత్రం ఆ పదవి తీసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి కాసేపట్లో తేలిపోనుంది.
ఇదిలా ఉంటే రాహుల్ వయనాడ్ స్థానం వదులుకోనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రెండు స్థానాల నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ అనేది కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. ఫిరోజ్‌గాంధీ దగ్గర నుంచి కాంగ్రెస్సే గెలుస్తోంది. కాబట్టి ఈ స్థానాన్ని రాహుల్ అంటుపెట్టుకుని ఉండాలని చూస్తున్నారు. ఇక ప్రియాంక కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ వయనాడ్ వదులుకుంటే.. బైపోల్లో వయనాడ్ నుంచి ప్రియాంక రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!