NTV Telugu Site icon

Congress: నేటితో కాంగ్రెస్ పాలనకు 100 రోజులు

Congress

Congress

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి నేటి సరిగ్గా వంద రోజులు అవుతుంది. గతేడాది డిసెంబర్‌ 7వ తేదీన పాలనా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల ప్రగతి నివేదనను రిలీజ్ చేసింది. డిసెంబరు 7న ప్రగతిభవన్ దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిభా ఫూలే భవన్‌గా మార్చి.. అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది.

Read Also: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

కాగా, వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లూ ప్రధానంగా దృష్టి పెట్టింది. అభయ హస్తంలోని 13 కార్యక్రమాల్లో ఐదు పథకాలను వంద రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామ, పట్టణ సభలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో తేలింది. ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, అలాగే, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది.

Read Also: Tenth Exams: టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!

ఇక, సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని ఈ వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయలు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం త్వరలో అమలు కావాల్సి ఉంది. ఇళ్లు లేని పేదలకు స్థలం, రూ. 5 లక్షలు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు.. కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, ఉద్యోగాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. 29 వేల 384 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు. అలాగే, సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాలతో పాటు TSPSC బోర్డును ప్రక్షాళన చేసి.. కొత్త ఛైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. గ్రూప్-1 పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరో 563 ఉద్యోగాలతో కొత్త ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేష్ రిలీజ్ చేసింది.