NTV Telugu Site icon

Haryana: ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్ కి వినతి పత్రం

New Project (4)

New Project (4)

హర్యానాలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా గవర్నర్ బండారుదుత్త త్రేయకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం మెమోరాండం సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో ప్రతిపక్ష నేత భూపేంద్ర హుడా, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్‌తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో బీబీ బాత్రా, అఫ్తాబ్ అహ్మద్, గీతా భుక్కల్ ఉన్నారు.

READ MORE: Domestic Airline Market: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా అవతరించిన ఇండియా..

గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్‌ నుంచి కాంగ్రెస్‌ బృందంతో బయలుదేరిన భూపేంద్ర హుడా.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని హుడా గవర్నర్‌ను డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్‌తో కలిసి హుడా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తారని, అందులో గవర్నర్‌తో ఏం చర్చించారో హుడా చెప్పనున్నారు. గతంలో కాంగ్రెస్ బలపరీక్ష డిమాండ్ చేయగా.. ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకోవడం గమనార్హం. వాస్తవానికి, బీజేపీతో పోలిస్తే ప్రతిపక్ష శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా హర్యానా కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు బలపరీక్షకు బదులు అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి కాంగ్రెస్‌ను వీడిన తర్వాత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 28కి తగ్గిందని తెలిసిందే. గతంలో వరుణ్ చౌదరి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ముల్లానా అసెంబ్లీకి రాజీనామా చేశారు.