NTV Telugu Site icon

Congress: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్

Sasitharor

Sasitharor

పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలను టార్గెట్‌గా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మండిపడ్డారు.

పార్లమెంట్‌లో మోడీ చేసిన ప్రసంగాన్ని.. విపక్షాలపై చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఖండించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ చనిపోయి చాలా ఏళ్లు అయినా వారి గురించి ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు. గాంధీ కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను చూసి మోడీ భయపడినట్లుగా ఉన్నారు.. అందుకే మోడీ ప్రసంగమంతా కాంగ్రెస్ గురించే ఉందన్నారు. సమయం మొత్తం కాంగ్రెస్‌కు అంకితం చేసినందుకు మోడీని మెచ్చుకోవాలన్నారు.

కాంగ్రెస్ గురించి మోడీ ఏమన్నారంటే…
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్‌ తీరు మారలేదు అన్నారు. కుటుంబ పాలనతో దేశం ఎంత నష్టపోయిందని.. కాంగ్రెస్‌ నాయకులు కూడా అంతే నష్టపోయారన్నారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారని.. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరని. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్‌ చేస్తోందని తెలిపారు. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదన్నారు. ఇండియా కూటమి కుదుపులకు లోనైందని చెప్పారు. విపక్షాల సంకల్పానికి తాను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు మోడీ చురకలంటించారు.

నెహ్రూ ఇలా అన్నారు..
భారతీయులకు కష్టపడి పనిచేసే అలవాటు లేదని ఎర్రకోట నుంచి నెహ్రూ అప్పట్లో చెప్పారనీ.. యూరప్, జపాన్, చైనా, రష్యా, అమెరికా ప్రజలు కష్టపడినంతగా ఇండియన్లు కష్టపడలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నరేంద్ర మోడీ గుర్తుచేశారు.