Site icon NTV Telugu

TPCC: ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

TPCC: ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి , మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.

Read Also: Robbery: ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోపిడి

అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాలలో పరువును దెబ్బతీసాయి. అదానీపై ఆర్థిక అవకతవకలు, నేరారోపణలు, అవినీతి, మోసం, మని లాండరింగ్, మార్కెట్ మానిపులేషన్ లాంటి అంశాలలో ఆయనపై ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీసాయి. మణిపూర్‌లో వరసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోడీ ఇప్పటి వరకు అక్కడకు వెల్లకపోవడంలాంటి అంశాలపై ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు చలో రాజ్‌భవన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

Exit mobile version