Site icon NTV Telugu

Adilabad: ఆదిలాబాద్ లో అంగన్వాడీలు, పోలీసుల మధ్య వివాదం

Adilabad

Adilabad

అంగన్వాడీల ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గత 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ కాకపోవడంతో అటు పోలీసులు ఇటు అంగన్వాడీల మధ్య వివాదం చెలరేగింది. ఇక, ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీలు, పోలీసుల మధ్య వివాదం ముదురుతుంది. జిల్లా పోలీసులపై మహిళ కమిషన్ తో పాటు ఎస్టీ కమిషన్ లో తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫిర్యాదు చేసింది.

Read Also: Jailer: జైలర్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే.. ?

జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆదివాసి, దళిత అంగన్వాడీ ఉద్యోగులను కులం పేరుతో దూషించిన ఆదిలాబాద్ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. 20వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నాకు దిగారు. మహిళలైన అంగన్వాడీ ఉద్యోగుల పట్ల లేడీస్ అండ్ జెంట్స్ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.

Read Also: Ram Charan: చిరంజీవి నటజీవితానికి 45 ఏళ్ళు.. మెగా పవర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

తలమడుగు ఎస్ఐ ధనశ్రీ ఆదివాసీ, దళిత మహిళలు అయిన అంగన్ వాడీలను ఉద్దేశించి భూతులు తిట్టారని ఫిర్యాదులో యూనియన్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన రోజు విధుల్లో ఉన్న తనను అంగన్వాడీలు జుట్టు పట్టి లాగి విధులకు ఆటంక పర్చారని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ధనశ్రీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే అంగన్వాడీలతో పాటు యూనియన్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version