Ram Charan: చిరంజీవి నటజీవితానికి 45 ఏళ్ళు.. మెగా పవర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Wishes Chiranjeevi on Completion of 45 years: జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఆ తర్వాత చిన్న హీరోగా.. సుప్రీం హీరోగా.. మెగాస్టార్ గా.. ఓ సినీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా కనిపించే ఓ అసాధారణ వ్యక్తిత్వం కలిగిన చిరంజీవి.. సినిమా రంగంలోకి వచ్చి 45 ఏళ్లు పూర్తి అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (శుక్రవారం) తన జీవితంలో ఓ కీలక మైలు రాయిని దాటారు. ఆయన జీవితంలో అనడం కంటే.. ఆయన తన సినిమా జీవితంలో ఈ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నారు అనవచ్చు. ఈ సందర్భంగా ఆయన మూవీ కెరీర్ ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు రామ్ చరణ్. సినిమాల్లో 45 ఏళ్ల మెగా జర్నీని పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రియతమ మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు.
Sai Pallavi: డైరెక్టర్ తో సాయి పల్లవి సీక్రెట్ పెళ్లి.. సాయి పల్లవి రియాక్షన్ ఇదే ..!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఎంత అపురూపమైన ప్రయాణం కూడా. #PranamKhareedu తో ప్రారంభించి , మీ అబ్బురపరిచే పెర్ఫార్మెన్స్‌లతో ఇంకా బలంగా కొనసాగుతున్నారు, మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యక్రమాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, అన్నింటికంటే ముఖ్యంగా కరుణ విలువలను పెంపొందించినందుకు ధన్యవాదాలు నాన్న అని అంటూ ఆయన ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు’ విడుదలైంది, ఆ సినిమాతోనే తన పేరు చిరంజీవిగా మారిందని చిరు చెబుతూ ఉంటారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రెండు సినిమాలు అనౌన్స్ చేశారు.. ఒక పక్క సుష్మిత నిర్మాణంలో ఆయన ఒక సినిమా చేయనుండగా మరోపక్క వశిష్ట డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయనున్నారు.
Hearty Congratulations to our beloved Megastar @KChiruTweets garu on completing 45 amazing Years of Mega Journey in Cinema!❤️ What an incredible journey! Starting with #PranamKhareedu & still going strong with your dazzling performances😍
You continue to inspire millions both… pic.twitter.com/PymipPkN7N
— Ram Charan (@AlwaysRamCharan) September 22, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!