Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది‘పై భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేసున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది. ఈ వాయిదా వెనుక బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కేవలం కొంత మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. నిజానికి సినిమా అనుకున్న సమయానికే రెడీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మేకర్స్ ‘క్వాలిటీ’ కోసం మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తొందరపడి సినిమాను విడుదల చేయడం కంటే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిజి వర్క్ విషయంలో ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్‌గా ఉండాలని టీమ్ భావిస్తోంది. సిజి పనులకు మరికొంత సమయం పడుతుండటంతో అలానే రెహమాన్ నేపధ్య సంగీతం వర్క్ కూడా కొంత మేర బాకీ ఉండేదంతో హడావిడిగా కాకుండా అవుట్‌పుట్ అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే విడుదల తేదీని వెనక్కి జరిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ వాయిదాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత మేకర్స్ త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన మేకోవర్ కనిపిస్తున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?