Wedding Kit: వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్.. ప్రభుత్వ కొత్త పథకం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wedding Kit: మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో సోమవారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజన పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ఒక పథకం కింద సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో 296 జంటలు వివాహం చేసుకున్నారు. ఈ పథకం కింద నవ దంపతులకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. పథకంలో భాగంగా దంపతుల మధ్య పంపిణీ చేసిన మేకప్ బాక్సుల్లో ప్యాకెట్లు కనిపించాయి.
కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేసే అవకాశం ఉందని జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ రాష్ట్ర ఆరోగ్య శాఖపై నిందలు వేశారు.”కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత మాది కాదు. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ మెటీరియల్‌ని అందజేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజన కింద మేము నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి రూ.49,000ని బదిలీ చేస్తాము. ఆహారం, నీరు, టెంట్ అందించే బాధ్యత మాది. దీని విలువ రూ.6,000 ఉంటుంది. పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు.” అని జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ చెప్పారు.
Also Read
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- Nasha Mukt Bharat Yatra : డ్రగ్స్‌పై పోరుకు మెగాస్టార్ మద్దతు.. కిషన్ రెడ్డితో కలిసి కీలక అడుగు
Read Also: Imran Khan: జిన్నా ఇంటిపై దాడి కేసు.. ఇమ్రాన్‌ఖాన్‌కు సమన్లు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏప్రిల్ 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజనను ప్రారంభించింది. పథకం కింద, ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ.55,000 అందిస్తుంది. గత నెలలో దిండోరిలోని గడ్సరాయ్ ప్రాంతంలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో కొంతమంది వధువులకు గర్భ పరీక్షలు చేయించడంతో ఈ పథకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన ఒక మహిళ పెళ్లికి ముందు తన కాబోయే భర్తతో కలిసి జీవిస్తున్నట్లు చెప్పింది. సాధారణంగా వధూవరుల వయస్సును నిర్ధారించడానికి, సికిల్ సెల్ అనీమియాను తనిఖీ చేయడానికి, వారు శారీరకంగా దృఢంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి పరీక్షలు నిర్వహించబడతాయని డిండోరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!