NTV Telugu Site icon

Anti-Rape Bill: ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లో ఉరి.. అత్యాచార నిరోధక బిల్లు పూర్తి వివరాలు

Anti Rape Bill

Anti Rape Bill

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అత్యాచార నిరోధక బిల్లు ఆమోదం పొందింది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తర్వాత మమతా ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాల తొలిరోజైన ఈరోజు అత్యాచార నిరోధక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అపరాజిత మహిళలు, పిల్లల బిల్లు 2024 అని పేరు పెట్టింది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో ఈ బిల్లుకు మద్దతుగా అనేక ఉదాహరణలు ఇచ్చారు.

READ MORE: Harbhajan Kohli: 10 వేల రన్స్‌ చేయకపోతే సిగ్గుపడాలి.. కోహ్లీతో హర్భజన్‌!

అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ 2020లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 20 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం, బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం, దారుణ హత్య చేసిన ఘటనలను ప్రస్తావించారు. అలాగే గత వారం జైపూర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి ప్రస్తావించారు. యుపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై నేరాల రేటు ఎక్కువగా ఉందని, అక్కడ న్యాయం జరగడం లేదన్నారు. కానీ బెంగాల్ మహిళలకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందన్నారు.

READ MORE: Mohammed Shabbir Ali: ముంపు ప్రాంతంలో డబుల్ బెడ్ నిర్మాణాలు చేపట్టారు…

అత్యాచార నిరోధక బిల్లు గురించి పూర్తి వివరాలు…
– ఈ బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడే నేరస్థులకు మరణశిక్ష విధించే నిబంధన ఉంది.
– ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధనను పొందుపరిచారు.
– 21 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
– నేరస్థుడికి సహాయం చేసినందుకు యత్నిస్తే.. 5 సంవత్సరాల జైలు శిక్ష.
– ప్రతి జిల్లాలో భికర్ స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
– అత్యాచారం, యాసిడ్, దాడి, వేధింపుల వంటి కేసుల్లో ఈ టాస్క్‌ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది.
– బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై 3-5 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది.
– అత్యాచారం విచారణను వేగవంతం చేసేందుకు బీఎన్ఎస్ఎస్ (BNSS) నిబంధనలలో సవరణలు బిల్లులో ఉన్నాయి.
– అన్ని లైంగిక నేరాలు, యాసిడ్ దాడుల విచారణను 30 రోజుల్లో పూర్తి చేసే నిబంధనలో పేర్కొన్నారు.

Show comments