CI Anju Yadav: జనసేన లోకల్ లీడర్‌పై చేయి చేసుకుని చెంపలు వాయించిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్స్‌ప్టెక్టర్ అంజు యాదవ్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయారు.. ఇక, సీఐ అంజు యాదవ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మా పార్టీ నేత సాయిపై చేయి చేసుకున్నారు.. శ్రీకాళహస్తి వచ్చే తేల్చుకుంటామంటూ ప్రకటించారు.. మరోవైపు సీఐ అంజు యాదవ్‌పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. జనసేన పార్టీకి చెందిన నేత సాయి మహేష్ పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడం, దురుసుగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. డిజిటల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దీనిపై కథనాలు రావడం.. వివిధ పత్రికల్లో ఫొటోలు, వార్తల ప్రచురితం కావడంతో.. వాటిని మానవ హక్కుల సంఘం పరిశీలించి సుమోటో గా స్వీకరించింది. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
Read Also: Bhagavanth Kesari : అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న బాలయ్య సినిమా..?
మరోవైపు ఈ వ్యవహారం డీజీపీ వరకు వెళ్లింది.. సీఐ అంజుయాదవ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య.. రాష్ట్రంలో ఒకవర్గం పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించిన ఆయన.. ప్రతిపక్ష నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ దోషులను మాత్రం ప్రీగా వదిలిపెడుతున్నారని విమర్శించారు.. మరికొంతమంది పోలీసులు ప్రజలపై దాడులు చేస్తూ చట్టఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొట్టే సాయి అనే జనసేన నేతను సిఐ అంజుయాదవ్ నడిరోడ్డుపై చెంపలుపై కొట్టి అవమానించారు. అంతేకాకుండా, జనసేన నేతను కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారు.. అధికారపార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా అంజుయాదవ్ గతంలోను దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. 2022 సెప్టెంబర్ లో ధనలక్ష్మీ అనే మహిళపై సైతం అంజుయాదవ్ తన జులం ప్రదర్శించారు.. అప్పుడు అంజుయాదవ్ దాడిలో గాయపడిన ధనలక్ష్మీ హాస్పిటల్ పాలైంది… అంజుయాదవ్ లాంటి పోలీసుల దురుసు ప్రవర్తనతో రాష్ట్రంలో పోలీసుల ప్రతిష్ట రోజురోజు దిగజారుతోందని ఆరోపించారు. ఇటువంటి పోలీసుల ప్రవర్తనతో పౌరులకు రాజ్యాంగంలో ప్రసాధించిన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతోందని.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య.