TG: రాష్ట్రంలో బీర్ల కొరతకు కారణం ఇదే.. అసలు నిజం చెప్పిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రెస్ నోట్ లోని వివరాల ప్రకారం… “ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసన్స్ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. సాదారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుంది. కాని బీరు డిమండ్ మేరకు.. బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆరు బ్రూవరీస్‌లో, నాలుగు బ్రూవరీస్ 95 శాతం వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ ఉత్ప్సత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
Also Read
“డిమాండ్ ఉన్న నాలుగు కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామార్ధ్యం 1,66,000 కేసులు. ఇలా మూడు షిప్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కాని మూడు షిప్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి. తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్ కార్పొరేషన్ డిపోల్లో, బ్రూవరీస్‌ల్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్‌లో బీరు కొరత లేదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్పా మిగిలిన అన్ని రకాలు బీర్లు అందు బాటులో ఉన్నాయి. బీరు తయారు చేసే కంపెనీలు మూడు షిప్టుల అనుమతి తీసుకున్న కూడ తగిన బీరు ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్ బీరు కొతర కొరత ఏర్పడిరది. ఐయిప్పటికి ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారు. ” అని స్పష్టం చేశారు.
“తెలంగాణలో కొత్త బ్రాండ్‌ల అనుమతికి సంబంధించి చాల సంవత్సరాలుగా ఉన్న పద్దతిని కొనసాగిస్తున్నారు. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్‌ను తెలంగాణ బేవరీజెస్ కార్పోరేషన్‌కు సరఫరా చేయడానికి బ్రెవరేజ్‌స్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అన్నవారికి అనుమతిస్తారు. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన ఐదు నెల్లలో నాలుగు బీరు బ్రాండ్స్‌ను సరఫరా చేయుటకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల్లో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నాం.” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!