Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
- అసెంబ్లీ సమావేశాలకు మరో రోజు పొడిగింపు
- మూడు రోజుల విరామం తర్వాత బుధవారం సభ
- 22A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
- విచారణపై మంగళవారం కీలక నిర్ణయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సమావేశాలు ముగియాల్సి ఉన్నా.. ఒక రోజు అదనంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో బుధవారం కూడా అసెంబ్లీ సమావేశం కానుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ మూడు రోజుల విరామం తర్వాత బుధవారం సభ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం ఎల్‌నినో అంశంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం సభ వాయిదా పడనుంది.
మంగళవారం సీఎం రేవంత్ కీలక భేటీ
ఇదిలా ఉంటే.. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 22A భూముల అంశంపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణకు ఆదేశించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగే మంత్రుల సమావేశంలో 22A భూముల అంశంపై ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విచారణకు ఆదేశించాలా? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో 22A అంశంపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
Also Read
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..