Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోల్ట్ బ్రాండ్ నుంచి తాజాగా విడుదలైన బోల్ట్ ఏస్ 5జి , బోల్ట్ ఈవో స్మార్ట్ఫోన్లు మొదటి సేల్‌లో అద్భుతమైన స్పందనను సాధించి పూర్తిగా అమ్ముడైపోయాయి. తక్కువ ధరలో మెరుగైన 5జి ఫోన్ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఈ రెండు మోడళ్ల తర్వాత సేల్ తేదీని అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ రెండు స్మార్ట్ఫోన్లు సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నవి. తొలి సేల్‌లో భారీ ఆదరణ లభించినందుకు కృతజ్ఞతలు తెలిపిన కంపెనీ, తక్కువ ధరలకే ఈ ఫోన్లను అందించనున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా జరిగే ఈ సేల్‌లో బోల్ట్ ఏస్ 5జి మోడల్ రూ. 12,999 ధరకు, అలాగే బోల్ట్ ఈవో మోడల్ రూ. 9,999 ప్రారంభ ధరకే లభించనున్నాయి.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు పలు అద్బుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రెండింటిలోనూ 6.79 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఇవ్వబడింది. ఇది 120 హర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. హార్డ్‌వేర్ పరంగా, బోల్ట్ ఏస్ 5జి ఫోన్ ఆక్టా-కోర్ యూనిసాక్ టి8200 చిప్సెట్తో వస్తుండగా.. బోల్ట్ ఈవో మోడల్ యూనిసాక్ టి7250 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఏస్ 5జి వేరియంట్ 8జీబీ వరకు రామ్, 128జీబీ స్టోరేజ్‌ను ఇస్తుంది. అలాగే ఈవో వేరియంట్ 6జీబీ రామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్లలోనూ మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పొడిగించుకునే సదువులనం ఉంది.
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
కెమెరా విషయానికి వస్తే.. ఏస్ 5జి ఫోన్లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈవో మోడల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. రెండు ఫోన్లలోనూ సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చబడి ఉంది. అయితే ఏస్ మోడల్లో మాత్రమే 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లు 5జి, 4జి ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. తక్కువ ధరలో.. మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!