తెలుగు నటుడు, కమెడియన్, హీరో, విలన్ సునీల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కమెడియన్ గా ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు.. ప్రధాన పాత్రలతో సహా 180కి పైగా చిత్రాలలో కనిపించాడు. అతను మూడు రాష్ట్ర నంది అవార్డులు మరియు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ గెలుచుకున్నాడు . 2000వ దశకంలో అతని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు అతను టాలీవుడ్లోని అత్యుత్తమ హాస్యనటులలో ఒకరిగా పేరు సంపాదించాడు.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాకు అతని మంచి పేరును తీసుకొచ్చింది..
ఆ తర్వాతగా వచ్చిన మర్యాద రామన్న సినిమా భారీ విజయాన్ని అందుకున్నాడు.. విలన్ గా కూడా మెప్పించాడు.. అందులో తెలుగులో పుష్ప, కలర్ ఫోటో సినిమాలు ఉన్నాయి.. ఇక తమిళంలో మావీరన్, జైలర్ సినిమాలు ఉన్నాయి.. అయితే సునీల్ గురించి ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేంటంటే అతని రెమ్యూనరేషన్.. ఒకప్పుడు ఒక్కో సినిమాకు దాదాపుగా 10 లక్షల పారితోషికం తీసుకునేవారు.. సినిమాలు కొన్ని బాగానే హిట్ అయ్యాయి..
ఇక ఆ తర్వాత హీరోగా వచ్చిన పూలరంగడు సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ కామెడీ రోల్స్ లో నటిస్తున్నాడు. ఇవి కూడా కొన్ని ఫెయిలయ్యాయి.. ఆ తర్వాత రవితేజ సినిమాలో మొదటగా విలన్ గా చేశాడు.. అది అనుకున్న హిట్ టాక్ అందుకోలేక పోయింది.. దాంతో ట్రాక్ మార్చి నెగెటివ్ పాత్రలు చేయడం మొదలు పెట్టారు. కలర్ ఫొటో సినిమాలో విలన్ గా నటించిన తర్వాత పుష్ప సినిమాతో మంచి పాపులారిటీని పెంచుకున్న సునీల్ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి రూ. 10 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు..